KDP: బ్రహ్మంగారిమఠంలో వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. బద్వేల్ రోడ్డులోని ఓ గోదాంలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 1500 ఎరువుల బస్తాలను గుర్తించి సీజ్ చేశారు. ఎఫ్‌సీఓ చట్టం 1985 ప్రకారం చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో జేడీఏ వెంకటేశ్వరరావు, ఏవో సుమంత్ రెడ్డి, ఎంఏవో ప్రవీణ్ పాల్గొన్నారు.
వార్తలు
ఎరువుల గోదాంపై దాడి.. 1500 బస్తాలు సీజ్


