హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం

అసోం శాసనసభ సభ్యులందరూ పార్టీలకు అతీతంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగువ అస్సాంలోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలకు మద్దతుగా తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం ప్రతి పౌరుడి, ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు.