హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మేడారం తరహాలో టోర్నడో కలకలం..?

MLG: రెండేళ్ల క్రితం మేడారంలో సంభవించిన ఘటనను తలపించేలా మంగపేట మండలం కోమటిపల్లి అటవీప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో వృక్షాలు నేలవాలాయి. ఫన్నెల్‌ ఆకారపు సుడిగాలిని ఓరైతు చిత్రీకరించగా వీడియో వైరల్‌గా మారింది. సమీపంలోని 2 గొత్తికోయ గ్రామాలకుఎలాంటి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.