హైదరాబాద్: 28°C
వార్తలు

చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను బుధవారం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించిన తర్వాతే యాత్రను యథావిధిగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.