బాపట్లలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చలానా కన్నా ప్రాణం మిన్న అని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. మైనర్లు వాహనాలు నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వార్తలు
హెల్మెట్ ధరించండి: ఎస్సై


