హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

POK కేంద్రంగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. POK ఎప్పటికీ భారత్ అంతర్భాగమని మరోసారి పునరుద్ఘాటించింది. పాక్ అక్రమంగా, ఎన్నికలు నిర్వహించినా వాటికి చట్టబద్ధత లేదని చెప్పింది. ఈ ప్రాంతంలో పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కపట ప్రయత్నాలకు పాల్పడుతోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.