SRCL: కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో మంగళవారం హైమస్ లైట్ ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లైట్ ఏర్పాటు చేయడంతో రైతులకు వెలుతురు సౌకర్యం కలిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై రాత్రి వేళల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ఆనందం వ్యక్తం చేశారు.
వార్తలు
ప్రభుత్వ విప్ చొరవతో వెంకట్రావుపేటలో హైమస్ లైట్లు


