హైదరాబాద్: 28°C
వార్తలు

అటవీ సంరక్షణ అందరి బాధ్యత: డీఎఫ్‌వో

BDK: జిల్లాలో అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పిలుపునిచ్చారు. నకిలీ ఆర్‌వోఎఫ్‌ఆర్ దరఖాస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.