పేపర్ లీక్ ఘటనల్లో మాఫియా ఉందని, దాన్ని అరికట్టాలని ప్రియాంక గాంధీ అన్నారు. పేపర్ లీక్ చేసి పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారని, దీనివల్ల వందలమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలమంది పిల్లల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. కెమెరాల యాంగిల్ కాదు.. ప్రధాని మనసులో మార్పు రావాలని మోదీ ఇన్‌స్టా రీల్స్‌ను ఉద్దేశించి ఆమె ఎద్దేవా చేశారు.
వార్తలు
పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు: ప్రియాంక


