హైదరాబాద్: 28°C
వార్తలు

దస్తావేజు లేఖరుల దీక్షకు సీపీఐ మద్దతు

KRNL: ఎమ్మిగనూరులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్‌డౌన్ దీక్షకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. జీవో 396, పీపీపీ విధానం వల్ల లేఖరులు, స్టాంప్ వెండర్ల కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆర్‌ఎస్‌కే కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జీవో 396, పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.