ATP: కూటమి ప్రభుత్వం DSC పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు, ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
వార్తలు
డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: ఎమ్మెల్యే


