హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి

AKP: ఎలమంచిలి మండలం ములకలాపల్లిలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి చెందాడు. పొలంలో దుబాసి అప్పలనాయుడు (62) పనిచేస్తుండగా తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ఉపేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.