హైదరాబాద్: 28°C
వార్తలు

'పత్తికొండలోనే గురుకులం ఏర్పాటు చేయాలి'

KRNL: మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండలోనే ఏర్పాటు చేయాలని లోక్సత్తా పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనందాచారి ఆధ్వర్యంలో నాయకులు ఆర్డీవో ఓబులేసుకు వినతిపత్రం అందించారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, ఆస్పరి, దేవనకొండ మండలాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు.