హైదరాబాద్: 28°C
వార్తలు

పరీక్షల నిర్వహణలో NDA విఫలం: అభిషేక్ బెనర్జీ

ప్రశ్నపత్రాల లీక్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. పేపర్ లీక్‌లను యువత ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తెలిపారు. వరుసగా ప్రశ్నపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో NDA ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీక్‌లను అరికట్టాలంటే కఠిన చట్టాలు ఉండాల్సిందేనని లోక్‌సభలో తెలిపారు.