హైదరాబాద్: 28°C
వార్తలు

వల్లప్ప చెరువు అభివృద్ధి పనులు వేగవంతం

PLD: నరసరావుపేటలో వల్లప్ప చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మొక్కల కిషోర్ తెలిపారు. రూ.48 లక్షలతో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన వాకింగ్ సౌకర్యం కల్పించి వల్లప్ప చెరువును అందమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.