హైదరాబాద్: 28°C
వార్తలు

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

TPT: శ్రీకాళహస్తిలోని రామసేతు బ్రిడ్జి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రత, పరిమాణం, సిబ్బంది సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా నిర్వహించాలని, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సిబ్బందికి ఆదేశించారు.