హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ టైగర్ డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: అర్ధవీడులోని దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్లోబల్ టైగర్ డే సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు పులుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటించి "సేవ్ టైగర్ – సేవ్ నేచర్" అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ముక్కు ప్రసాద్ రెడ్డి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.