హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా

సత్యసాయి: ధర్మవరం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిస్కారానికి ఈనెల 30న సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరూ పాల్గొంటున్నారని, ఆ రోజు సెలవు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్యకు సీఐటీయూ బృందం వినతిపత్రం అందజేసింది.