CTR: పెనుమూరు మండలం పాల్యం కొండలో బుధవారం గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపూజ, రుద్రాభిషేకం, ధర్మ జ్యోతి ప్రజ్వలనం, భజనలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశ శాంతి, విశ్వ మానవ కళ్యాణం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు రోజంతా అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
వార్తలు
రేపు గురు పౌర్ణమి మహోత్సవాలు


