హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరోగ్య తనిఖీలు.. విద్యార్థినీలకు అవగాహన

MDK : చేగుంట మండలంలోని KGBV లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వైద్య బృందం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ మృదుల ఆధ్వర్యంలో సీహెచ్వి, ANM ఆశా కార్యకర్తలు విద్యార్థినులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధుల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థినులకు సూచనలు అందించారు.