హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంబా జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నివాసాల్లోకి బురద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చంబా-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
వార్తలు
భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు


