హైదరాబాద్: 28°C
వార్తలు

'పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష'

SRCL: సిరిసిల్ల పట్టణంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బుర్లా చంద్రశేఖర్‌కు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. కేసులో కృషి చేసిన అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.