హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్లుండి శ్రీకాకుళంలో వైఎస్‌ జగన్‌ పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. ఇటీవల అప్పలరాజు అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఉత్తరాంధ్రలోని పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది.