హైదరాబాద్: 28°C
వార్తలు

16 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై, వ్యూహాత్మక చర్యల ఫలితంగా వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు అత్యంత కీలక నేతలు కాగా, వీరిపై ప్రభుత్వం రూ.39 లక్షల భారీ రివార్డులను ప్రకటించింది.