హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే, ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు నినాదాలు ఆపకపోవడంతో అటు లోక్‌సభను, ఇటు రాజ్యసభను స్పీకర్లు వాయిదా వేశారు.