పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. అవామీ యాక్షన్ కమిటీ చలో ముజఫరాబాద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్‌కు ముందు పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు నిరసనకారులు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లాంగ్ మార్చ్‌ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుందని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది.
వార్తలు
పీవోకేలో ఉద్రిక్తత.. ఐదుగురు మృతి


