హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరణ

ADB: బోథ్ మండల కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన పెద్దఎత్తున జరిగే కొట్టాల పోచమ్మ ఆషాడ బోనాల జాతర పోస్టర్‌ని మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. గ్రామస్థులు, కమిటీ సభ్యులు కలిసి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ పోతన్న, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రమణ గౌడ్, ఎలుక రాజు, మెడిచేల్మా ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.