AKP: పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కోటవురట్లలో పారిశుధ్యం- పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను తొలగించి సంపద కేంద్రానికి తరలించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఎంపీడీవో


