హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు బోల్తా

J&K గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో 39 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు హరిగాన్వాన్ వద్ద ఓ ఇంటిపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. అమర్‌నాథ్‌లో పూజలు ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.