హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాలకు పెరుగుతున్న భక్తుల రద్దీ

HYD: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘అమ్మ పిలుస్తోంది’ అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనాలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రోగాలు నయమవుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోందని ఆలయ సిబ్బంది తెలిపారు.