HNK: హసన్ పర్తి మండలంలోని సిద్ధాపూర్, వంగపాడు గ్రామాల్లో సోమవారం అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీఐ హెచ్చరించారు.
వార్తలు
బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు


