JGL: ధర్మపురిలో ఎరువుల దుకాణాలను సోమవారం ఎంఏవో రాజ్ కుమార్ తనిఖీ చేశారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, కొనుగోలు చేసే ప్రతి ఉత్పత్తికి రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వానకాలం సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, బుకింగ్ యాప్ ద్వారానే అమ్మకాలు జరపాలని తెలిపారు. దుకాణాల్లో తప్పనిసరిగా ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
వార్తలు
ఎరువుల దుకాణాలు తనిఖీ


