హైదరాబాద్: 28°C
వార్తలు

బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.!

KMM: బోనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోవైద్య సేవల లభ్యత, ఓపీ, ల్యాబ్ పరీక్షలు, హాజరు పట్టిక, పరిశుభ్రతను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు.మందుల కొరత లేకుండా నిల్వలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.