MDK: రామాయంపేట 11వ వార్డు అక్కల బస్తిలో రాత్రి కురిసిన వర్షానికి రహదారిపై నీరు నిలిచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన బస్తి


