GDWL: అయిజ పట్టణంలోని సాయిబాబా అయ్యప్ప ఆలయంలో రేపు గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు కాకడ హారతి, 5.45 గంటలకు పంచామృతాభిషేకం, 8 గంటలకు ధునిపూజ, 10 గంటలకు గురుచరిత్ర పారాయణం, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
వార్తలు
VIDEO: రేపు గురుపూజోత్సవ వేడుకలు


