హైదరాబాద్: 28°C
వార్తలు

పిఠాపురం అభివృద్ధిపై పవన్ సమీక్ష

AP: పిఠాపురం అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కొత్త రోడ్లు, నాగులాపల్లి తాగునీటి సరఫరా పథకం అభివృద్ధిపై ఆరా తీశారు. పనుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యంపై అధికారులను పవన్ వివరణ కోరారు.