హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'రూ. 50 వేలు అప్పు తీసుకున్నందుకు భూమి కబ్జా'

కోనసీమ: రూ. 50 వేలు అప్పు తీసుకున్నందుకు తన ఐదు సెంట్లు భూమి కబ్జా చేశారని రామచంద్రపురం కి చెందిన బలభద్రుని వెంకటేశ్వరరావు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అప్పు తీసుకున్నప్పుడు కాలీ పేపర్ పై తీసుకున్న సంతకాన్ని దుర్వినియోగం చేసి తన భూమి ఆక్రమించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.