హైదరాబాద్: 28°C
వార్తలు

డెంగీ నివారణపై విద్యార్థులకు అవగాహన

ELR: డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణపై ఏలూరు అశోకనగర్‌లోని కేబీడీటీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి నిల్వలను తొలగించి, వారానికి ఒకసారి 'ఫ్రైడే -డ్రై డే' పాటిస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.