హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సొంత గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన!

NGKL: వంగూరు మండలం సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ పరిశీలించారు. ఏటీసీ భవనం స్థలాన్ని పరిశీలించి, నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.