హైదరాబాద్: 28°C
వార్తలు

గిన్నిస్ రికార్డు.. విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

ADB: రూరల్ మండలంలోని బంగారుగూడ మోడల్ స్కూల్ విద్యార్థులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. ఈ మేరకు విద్యార్థులను కలెక్టర్ రాజర్షిషా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించి సాధించుకోవాలని సూచించారు.