హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టా పాస్‌బుక్ మంజూరు చేయాలని వినతి

KRNL: పగిడిరాయి గ్రామానికి చెందిన నాగమ్మ, లక్ష్మన్న దంపతులు తమ కుటుంబం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమికి పట్టా పాస్‌బుక్ మంజూరు చేయాలని ఎంఆర్‌వోను కోరారు. 1.74 ఎకరాల భూమి 30 ఏళ్లకు పైగా తమ సాగులోనే ఉందని తెలిపారు. 2005లో అక్రమంగా వేరే వారి పేరిట పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.