హైదరాబాద్: 28°C
వార్తలు

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

KRNL: బాల్యవివాహాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలని సీ.బెలగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు అన్నారు. సోమవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్సై వేణుగోపాల్ రాజు ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, మహిళా వేధింపులు, చైల్డ్ హెల్ప్ లైన్‌పై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.