VZM: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, అనంతరం జరిగే బహిరంగ సభలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరు కార్యాలయంలో ప్రత్యేకంగా 'కోర్ కంట్రోల్ రూమ్'ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నియోజకవర్గాల వారీగా, అధికారుల వారీగా పనుల పురోగతిని, కార్యక్రమ వివరాలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
వార్తలు
కలెక్టరేట్‌లో కోర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు


