హైదరాబాద్: 28°C
వార్తలు

కనిగిరిలో ‘పోలీస్ మీకోసం’కు 59 ఫిర్యాదులు

ప్రకాశం: కనిగిరి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో కనిగిరి పోలీస్ స్టేషన్‌లో సోమవారం ప్రత్యేక ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 59 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఆయన, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించారు.