హైదరాబాద్: 28°C
వార్తలు

ఉక్రెయిన్ అంబాసిడర్‌కు భారత్ సమన్లు

నల్లసముద్రంలో భారత నావికుడు సాగర్ గుప్తా ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. రష్యా జలాల్లో ప్రయాణిస్తున్న మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడంతో సాగర్ గుప్తా మరణించాడు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉక్రెయిన్ అంబాసిడర్ ఒలెక్సాండర్‌కు సమన్లు ఇచ్చింది. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.