హైదరాబాద్: 28°C
వార్తలు

వెలుగుపల్లిలో విత్తన మేళా ప్రారంభం

NLG: నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన మేళాను జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ఈ విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి సారించాలని సూచించారు. మూడు రోజుల పాటు మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు.