హైదరాబాద్: 28°C
వార్తలు

స్మశాన వాటిక స్థలం కోసం ధర్నా

SRD: రేజింతల్ గ్రామానికి స్మశాన వాటిక స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ CPM ఆధ్వర్యంలో గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామంలో మృతిచెందిన వారి అంత్యక్రియలకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరడుగుల జాగ కోసం నిత్యం నరకయాతన పడుతున్నామని పేర్కొంటూ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.