హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా స్థాయిలో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

W.G: తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పరుగు పందెంలో ప్రతిభ కనబరిచారు. 600 మీటర్ల విభాగంలో కే.భానుశ్రీ ద్వితీయ స్థానం, 1000 మీటర్ల పరుగులో కే.సూర్య నితీశ్ తృతీయ స్థానం సాధించినట్లు HM డీవీవీఎస్ఎన్ మూర్తి సోమవారం తెలిపారు. తిరుపతిలో ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపికైనట్లు పేర్కొన్నారు.