హైదరాబాద్: 28°C
వార్తలు

దోమల మందు పిచికారీ ప్రారంభం

ASR: రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ ఈతలపాడు గ్రామంలో రెండో విడత దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు వంశి కుంజం ప్రారంభించారు. పంచాయతీలోని అన్ని గ్రామాల్లో పిచికారీ నిర్వహిస్తామని, ప్రజలు ఇళ్లలోనూ మందు పిచికారీ చేయించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.