హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పేపర్ లీకేజీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి

PLD: నరసరావుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సీపీఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ.. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, ఢిల్లీ పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. మృతులకు కుటుంబాలకు కోటి రూపాయల చెల్లించాలని డిమాండ్ చేశారు.